Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'హింస, అశ్లీలత, ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేకుండా రూపొందించిన 'బిలాల్పూర్ పోలీస్ స్టేషన్' చిత్రాన్ని కుటుంబమంతా హాయిగా చూసి ఆనందించవచ్చు' అని గోరటి వెంకన్న అన్నారు.
మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘనా జంటగా గోరటి వెంకన్న కీలక పాత్రలో సాగసాయి మాకం దర్శకత్వంలో మహంకాళీ శ్రీనివాస్ నిర్మించిన చిత్రం 'బిలాల్ పూర్ పోలీస్‌స్టేషన్'. విడుదలైన సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోన్న నేపథ్యంలో దర్శకుడు నాగసాయి మాకం మాట్లాడుతూ, 'థియేటర్లో ఆడియెన్స్‌తో సినిమా చూస్తున్నప్పుడు ఇన్ని రోజులు పడ్డ కష్టం మర్చిపోయాం. సినిమా బాగుంటే, కొత్త, పాత ఆర్టిస్టులనే బేధం లేకుండా సినిమాని ఆదరిస్తారని మరోసారి నిరూపించారు' అని తెలిపారు.