Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరుణ్ ఆదిత్, నిక్కీ తంబోలి జంటగా సంతోష్ పి.జయకుమార్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'చీకటి గదిలో చితక్కొట్టుడు'. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో శనివారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో అరుణ్ ఆదిత్ మాట్లాడుతూ, 'సినిమా ట్రైలర్, పోస్టర్స్ చూసి బయట చాలా మంది నెగటివ్‌గా మాట్లాడారు. ఇదేం సినిమా అంటూ విమర్శించారు. కానీ వారందరికి ఈ సినిమానే సమాధానం చెప్పింది. బీ, సీ సెంటర్లలోనే కాదు, మల్టీప్లెక్స్‌లు కూడా ఫుల్ అయ్యాయి. ఆడియెన్స్ బాగా ఎంజారు చేస్తున్నారు. నేను కమర్షియల్ సినిమాలకి పనికి రాను, కొన్ని చిత్రాలకే పరిమితం అనే కామెంట్ వినిపించేది. చాలా రోజులుగా మంచి కమర్షియల్ సినిమా చేయాలనుకున్నా. ఈచిత్రం కమర్షియల్‌గా మంచి విజయం సాధించడం హ్యాపీగా ఉంది. భారీ సక్సెస్ వచ్చినా నాలో తేడా రాదు. నెక్ట్స్ ఏ సినిమా చేయాలనే ఆలోచనలోనే ఉన్నా. ఆదరిస్తున్న ఆడియెన్స్‌కి థ్యాంక్స్' అని అన్నారు. 'సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. దర్శకుడిగా నన్ను స్వీకరించిన టాలీవుడ్‌కి థ్యాంక్స్. ఇది రెండు రోజుల్లో రూ.5.5 కోట్లు రాబట్టింది. ఆడియెన్స్ థియేటర్ సీట్లో కూర్చొని జంపింగ్ చేస్తూ కడుపుబ్బ నవ్వుతున్నారు. సినిమాని మరింత హిట్ చేయాలని కోరుకుంటున్నా' అని దర్శకుడు సంతోష్ తెలిపారు. హీరోయిన్ నిక్కీ చెబుతూ, 'ఈ అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకి థ్యాంక్స్. సినిమాని థియేటర్లో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు. 'ఈ సక్సెస్ మరింత ఉత్సాహాన్నిచ్చింది' అని కెమెరామెన్ భల్లు తెలిపారు.