Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో వెంకటేష్ కుమార్తె అశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మెన్ సురేందర్‌రెడ్డి మనవడు వినాయక్రెడ్డితో నిశ్చయమైన విషయం విదితమే. నేడు(ఆదివారం) జైపూర్‌లోని ఓ ప్రముఖ హోటల్లో అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరగబోతోంది. ఈ వివాహ మహోత్సవానికి భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే,
శుక్రవారం రాత్రి ప్రీ వెడ్డింగ్ వేడుకలను అత్యద్భుతంగా నిర్వహించారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పాటు రానా, నాగచైతన్య, సమంత పాల్గొన్నారు. సల్మాన్‌తో రానా, వెంకటేష్, నాగచైతన్యతో సమంత దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శనివారం రాత్రి జరిగిన సంగీత్ కార్యక్రమంలో దగ్గుబాటి, అక్కినేని కుటుంబాలతోపాటు వారి సన్నిహిత బంధుమిత్రులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 6న అశ్రిత, వినాయక్రెడ్డిల ఎంగేజ్మెంట్ జరిగింది.