Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్య వరుసగా సినిమాలను లైన్లో పెడుతూ ఫుల్ బిజీ అయిపోతున్నారు. ఇప్పటికే ఆయన 'ఎన్జీకే', 'కాప్పాన్'లో నటిస్తున్నారు. సుధాకొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అది ఇటీవల ప్రారంభమైంది. తాజాగా శ్రీరామనవమి పండుగని పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్‌ని ప్రకటించారు. దీనికి 'సూరారై పోట్రూ' అనే పేరుని ఖరారు చేస్తూ టైటిల్ పోస్టర్ని శనివారం విడుదల చేశారు. భారీ విమానాన్ని కింది నుంచి చూస్తున్న సూర్య లుక్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. 2డీ ఎంటర్టైన్మెంట్స్, సిక్యా ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సూర్య ఈ సినిమా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే, కేవీ ఆనంద్ దర్శకత్వంలో 'కాప్పాన్'లో సూర్య నటిస్తున్న విషయం విదితమే. ఎన్ఎస్జీ కమాండోగా సూర్య నటిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్ర టీజర్‌ని నేడు(ఆదివారం) శ్రీరామనవమి పండుగని పురస్కరించుకుని విడుదల చేయనున్నారు. సాయేషా కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా ఆగస్ట్‌లో విడుదల కానుంది.