Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంటరైన విషయం విదితమే. అకౌంట్ ఓపెన్ చేసిన తక్కువ సమయంలోనే సుమారుగా 8.5లక్షల ఫాలోవర్స్ యాడ్ అయ్యారు. ప్రభాస్ అభిమానులు, తెలుగు ఆడియెన్స్‌తోపాటు దేశ వ్యాప్తంగా ప్రభాస్ ఫాలోవర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో మొదటగా ఏ పోస్ట్ పెడతారని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ 'బాహుబలి'లో ఇప్పటి వరకు బయటికి రాని ఓ కొత్త ఫొటోని పంచుకున్నారు. పోస్ట్ చేసిన వెంటనే 250 కె లైక్స్ వచ్చాయి. దీంతో దేశ వ్యాప్తంగా ప్రభాస్‌కి ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ ఏంటో అర్థమవుతుంది. ప్రస్తుతం ఆయన 'సాహో' చిత్రంలో నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా, శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ తెలుగు, తమిళం, హిందీలో నిర్మిస్తున్నారు. స్టయిలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవ కానుకగా విడుదల కానుంది. దీంతోపాటు రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నారు.