Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగులో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన 'అర్జున్‌రెడ్డి', 'టెంపర్', 'ఆర్ ఎక్స్ 100' ఇప్పటికే హిందీ, తమిళంలో రీమేక్ అవుతున్నాయి. తాజాగా మరో తెలుగు బ్లాక్ బస్టర్ 'మజిలీ' తమిళంలో రీమేక్ కాబోతుంది. ఈ చిత్ర రీమేక్ రైట్స్‌ని హీరో ధనుష్ దక్కించుకున్నారట. నాగచైతన్య పాత్రకి తానే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతానని భావించిన ధనుష్ తనే హీరోగా
ఈ చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్ హీరోహీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల విడుదలై భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. దాదాపు రూ.40కోట్లు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా. ప్రస్తుతం ధనుష్ తమిళంలో 'అసురన్' చిత్రంలో నటిస్తున్నారు. గత రెండేండ్లుగా ధనుష్‌కి సరైన విజయాలు లేవు. ఈ నేపథ్యంలో 'మజిలీ'తో హిట్ కొట్టాలని భావిస్తున్నారట.