Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో షోయింగ్ బిజినెస్ పతాకంపై ఎస్.ఎస్.కార్తికేయ నిర్మిస్తున్న చిత్రం 'ఆకాశవాణి'. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి యూనిట్ తెలియజేస్తూ, 'వైవిధ్యమైన కథాంశంతో రూపొందిస్తున్న చిత్రమిది. ఎస్ఎస్.రాజమౌళి దగ్గర 'ఈగ', 'బాహుబలి' చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అశ్విన్ గంగరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా, ఎస్.ఎస్.రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా పరిచయమవుతూ ఈ సినిమా రూపొందిస్తుండటం విశేషం' అని తెలిపింది. 'ఫ్రెష్ కంటెంట్‌తో ఓ రేడియో చుట్టూ దట్టమైన అడవిలో జరిగే ఆసక్తికరమైన చిత్రమిది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. పాడేరులోని అటవీ ప్రాంతంలో వేసిన భారీ సెట్లో దాదాపు 50 రోజులపాటు ఏకధాటిగా ఓ ఛాలెంజింగ్ షెడ్యూల్‌ని పూర్తి చేశాం. ఈ షెడ్యూల్ చాలా అడ్వెంచరస్‌గా అనిపిస్తుంది. ఒకే షెడ్యూల్లో సినిమాని పూర్తి చేస్తాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ ఏడాదిలోనే విడుదల చేస్తాం' అని దర్శకుడు అశ్విన్ గంగరాజు తెలిపారు.