Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం 'భారత్' చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కత్రినాకైఫ్ కథానాయికగా నటిస్తుంది. దిశాపటానీ, టబు, జాకీ ష్రాఫ్, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సర్కస్ ప్రధానంగా ఈ సినిమా సాగుతుందట. ఇందులో సల్మాన్ టీనేజ్ కుర్రాడి దగ్గర్నుంచి వృద్ధుడిగా ఐదు భిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నారు. ఈ గెటప్స్‌కి సంబంధించిన లుక్స్‌ని వరుసగా గత ఐదు రోజులుగా విడుదల చేస్తున్నారు. తొలుత 2010కి చెందిన వృద్ధుడి లుక్, ఆ తర్వాత 1964లో టీనేజ్ సర్కస్మెన్గా యంగ్ లుక్, అనంతరం 1976లో గని కార్మికుడిగా ఉన్న గెటప్, 1985లో నేవీ అధికారి లుక్‌ని, తాజాగా శుక్రవారం 1990కి చెందిన సాధారణ గెటప్‌ని విడుదల చేశారు. ఈ లుక్స్ అన్నింటిలో కత్రినా కైఫ్ కనిపిస్తుండటం విశేషం. దేశం కోసం ఓ వ్యక్తి జర్నీని తెలిపే కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. విడుదలైన అన్ని లుక్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి. రంజాన్ కానుకగా సినిమాని విడుదల చేయనున్నారు. సల్మాన్ దీంతోపాటు ప్రస్తుతం 'దబాంగ్ 3'లోనూ నటిస్తున్నారు. సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తున్న దీనికి ప్రభుదేవా డైరెక్షన్ చేస్తున్నారు.