Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కైరా అద్వానీ తెలుగులో నటించింది రెండు సినిమాలే అయినా ఆడియెన్స్‌కి బాగా దగ్గరైంది.
'భరత్ అనే నేను'లో మహేష్ లవ్ ఇంట్రెస్ట్‌గా, 'వినయ విధేయ రామ'లో చరణ్‌కి జోడీగా సాంప్రదాయ పాత్రలో నటించి మెప్పించింది. 'వినయ విధేయ రామ' పరాజయంతో తెలుగులో మరే ప్రాజెక్ట్‌కి సైన్ చేయలేదు. అయితే బాలీవుడ్లో పలు ప్రాజెక్టులతో బిజీ అయ్యింది. తాజాగా అఖిల్ సరసన నటించేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. 'అఖిల్', 'హలో', 'మిస్టర్ మజ్ను' వంటి హ్యాట్రిక్ పరాజయాల తర్వాత అఖిల్ ప్రస్తుతం 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమాకి ఓకే చెప్పారు.
గీతా ఆర్ట్స్‌లో అల్లు అరవింద్ నిర్మించే ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వానీని తీసుకునే ఆలోచనలో చిత్ర బృందం ఉందట. ప్రస్తుతం కైరా బాలీవుడ్లో 'కబీర్ సింగ్', 'గుడ్ న్యూస్' చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో విడుదలై సంచలన విజయం సాధించిన 'అర్జున్‌రెడ్డి'కి రీమేక్‌గా 'కబీర్ సింగ్' రూపొందుతున్న విషయం తెలిసిందే. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ అచ్చు తెలుగు 'అర్జున్‌రెడ్డి'కి మక్కీకి మక్కిగా ఉందని కామెంట్స్ వచ్చాయి.కైరా అద్వానీ తెలుగులో నటించింది రెండు సినిమాలే అయినా ఆడియెన్స్‌కి బాగా దగ్గరైంది.
'భరత్ అనే నేను'లో మహేష్ లవ్ ఇంట్రెస్ట్‌గా, 'వినయ విధేయ రామ'లో చరణ్‌కి జోడీగా సాంప్రదాయ పాత్రలో నటించి మెప్పించింది. 'వినయ విధేయ రామ' పరాజయంతో తెలుగులో మరే ప్రాజెక్ట్‌కి సైన్ చేయలేదు. అయితే బాలీవుడ్లో పలు ప్రాజెక్టులతో బిజీ అయ్యింది. తాజాగా అఖిల్ సరసన నటించేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. 'అఖిల్', 'హలో', 'మిస్టర్ మజ్ను' వంటి హ్యాట్రిక్ పరాజయాల తర్వాత అఖిల్ ప్రస్తుతం 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమాకి ఓకే చెప్పారు.
గీతా ఆర్ట్స్‌లో అల్లు అరవింద్ నిర్మించే ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వానీని తీసుకునే ఆలోచనలో చిత్ర బృందం ఉందట. ప్రస్తుతం కైరా బాలీవుడ్లో 'కబీర్ సింగ్', 'గుడ్ న్యూస్' చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో విడుదలై సంచలన విజయం సాధించిన 'అర్జున్‌రెడ్డి'కి రీమేక్‌గా 'కబీర్ సింగ్' రూపొందుతున్న విషయం తెలిసిందే. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ అచ్చు తెలుగు 'అర్జున్‌రెడ్డి'కి మక్కీకి మక్కిగా ఉందని కామెంట్స్ వచ్చాయి.