Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మతోనే పుట్టుక ప్రారంభం, అమ్మనే సృష్టికి మూలం, అమ్మలేని లోకం చీకటిమయం అవుతుందంటూ మాతృమూర్తిపై ప్రేమ నేపథ్యంలో లక్షమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై శివ ఏటూరి దర్శకత్వంలో ఎత్తరి గురవయ్య నిర్మిస్తున్న చిత్రం 'అమ్మ దీవెన'. ఈ నెల 17వ తేదీ నుంచి చివరి షెడ్యూల్ జరుపుకోనుంది. 'ఆడపిల్లలంటే అమ్మతో సమానం. అమ్మ బాగుంటే లోకమంతా బాగుంటుందంటూ ప్రతి తల్లీ గర్వపడేలా అమ్మ గొప్పతనం గురించి తెలియజేస్తూ ఆద్యంతం భాగోద్వేగభరితంగా నిర్మిస్తున్నాం. ఈ సినిమాని మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి తల్లీకి అంకితం ఇస్తున్నాం' అని నిర్మాత ఎత్తరి గురవయ్య చెప్పారు. 'ఈ సినిమా కథ మా నిర్మాత జీవితంలో జరిగిన కథ. మాతృమూర్తుల గొప్పతనం తెలియజేసే చిత్రమిది. ఆమని, పోసాని నటన అందరినీ అలరిస్తుంది. టాకీపార్ట్ పూర్తయ్యింది. చివరి షెడ్యూల్లో పాటలను చిత్రీకరిస్తాం. త్వరలోనే ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తాం' అని దర్శకుడు శివ ఏటూరి తెలిపారు. ఈ చిత్రానికి కథ : ఎత్తరి చిన మారయ్య, మాటలు : శ్రీను, సంగీతం : ఎస్.వి.హెచ్, కెమెరా : సిద్ధం మనోహర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పవన్, ఎడిటర్ :జెపి, ఫైట్ ్స: నందు, డాన్స్ : గణేష్ స్వామి, నాగరాజు.