Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు శిరీష్, రుక్సర్ థిల్లాన్ జంటగా సంజీవ్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఏబీసీడీ' (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి). డి.సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై మధుర శ్రీధర్‌రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక సోమవారం జరిగింది.
అతిథిగా విచ్చేసిన హీరో నాని మాట్లాడుతూ, 'ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే 'పిల్ల జమీందార్' సినిమా గుర్తుకొస్తుంది. ఆ సినిమాని మించి ఇది విజయం సాధించాలి. శిరీష్‌లో ఓ చిన్నపిల్లాడు ఉండేవాడు. నేను యాక్టింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు శిరీష్‌ను కలిశా. తను సినిమా బిజినెస్ గురించి చాలా మంచి ఆర్టికల్స్ రాసేవాడు. ప్రొడక్షన్లో అరవింద్‌గారికి మంచి సక్సెసర్ దొరికాడని అనుకున్నా. కట్ చేస్తే తను హీరో అయిపోయాడు. తన కెరీర్‌కి సంబంధించి ఏబీసీడీలు ఎప్పుడో స్టార్ట్ చేసిన శిరీష్, తన స్టార్ డమ్‌కు సంబంధించిన ఏబీసీడీలు ఈ సినిమాతో స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'మధుర శ్రీధర్ నాకు మంచి స్నేహితుడు. అతనితో గత కొంతకాలం నుండి ట్రావెల్ చేస్తున్నాను. ఈ సినిమాతో శిరీష్‌కు పెద్ద విజయం దక్కాలని కోరుకుంటున్నా' అని సురేష్‌బాబు చెప్పారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ,'రెండేళ్ల క్రితం ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందనే డిస్కషన్ వచ్చినప్పుడు రామ్ చరణ్ 'ఏబీసీడీ' సీడీ తెచ్చి ఇచ్చి ఈ క్యారెక్టర్ నీకు సూట్ అవుతుందని చెప్పాడు. ఈ సినిమాని చూసినప్పుడు నాకు నా పర్సనల్ లైఫ్‌ని చూస్తున్న ఫీలింగ్ కలిగింది. మా నాన్న కూడా గుర్తుకు వచ్చి నవ్వుకున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో హీరో డబ్బు విలువ తెలియకుండా పాడైపోయాడని భావించిన తండ్రి అతన్ని బాగు చేసుకోవడానికి ఏం చేశాడనేదే కథ. ఇందులో ఉన్నట్టుగానే.. బన్నీకి, రామ్‌చరణ్‌కు 21 ఏళ్లు వచ్చినప్పుడు కారు కొనిచ్చారు. నాకు 21 ఏళ్లు వచ్చినప్పుడు కారు కొనివ్వమని అడిగాను. ఏ కారు కావాలని నాన్న అన్నారు. మంచి స్పోర్ట్స్ కారు కావాలని అన్నాను. ఆయన 'చెప్పు ఇచ్చుకుని కొడతా. నీ వయసు వాళ్లు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ట్రావెల్ చేస్తున్నారు. నీకు కారు కొనివ్వడమే లగ్జరీ. అలాంటిది స్పోర్ట్స్ కారు కొనివ్వమని అడుగుతున్నావ్' అని ఫైర్ అయ్యారు. కారు కొనివ్వలేదు. నా స్వంత డబ్బులతోనే కొనుక్కుంటానని అన్నాను. ఆ కారు కొనడానికి నాకు మూడేండ్లు పట్టింది. నాకు అప్పుడు నాన్న చేసిన పని వల్ల డబ్బు విలువ తెలిసి వచ్చింది. కాబట్టి ఈ సినిమాని మా నాన్నకి డేడికేట్ చేస్తున్నా. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు అరవింద ప్రసాద్. మా నాన్న ఇన్స్పిరేషన్తోనే ఆ పేరు పెట్టుకున్నాను. ఈ సినిమాలో నాగబాబుగారు నా తండ్రి పాత్ర పోషించారు. ఎన్నారై యువకుడైన నేను ఇండియాకు వచ్చినప్పుడు డబ్బులు లేకుండా ఎలాంటి కష్టాలు పడ్డాననేదే సినిమా. ఇది చేస్తున్నప్పుడు నాకు ముంబైలో చదువుకున్న రోజులు గుర్తుకు వచ్చాయి. చాలా ఎంజారు చేస్తూ క్యారెక్టర్ చేశాను. సంజీవ్ మలయాళం నుండి చక్కగా అడాప్ట్ చేశాడు. రామ్ సినిమాటోగ్రఫీతో చక్కటి విజువల్స్ అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ జుడా సాండి ఈ జర్నీలో మంచి మిత్రుడయ్యాడు. అలాగే మధుర శ్రీధర్‌గారు, యష్ రంగినేని, ధీరజ్ మొగిలినేని అందరూ చక్కటి సపోర్ట్ అందించారు. రుక్సర్ గ్లామర్‌తోనే కాదు. పెర్ఫామెన్స్‌తో కూడా మెప్పిస్తుంది. సపోర్ట్ చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కు థ్యాంక్స్' అని చెప్పారు.
'ఈ సినిమాలో ఐదుగురు సీక్రెట్ సూపర్ హీరోస్ ఉన్నారు. బివిఎస్ రవి, పవన్ సాధినేని, వాసువర్మ, కృష్ణ చైతన్యలకు థాంక్స్. రైటింగ్ డిపార్ట్మెంట్లోని కాశీగారికి థాంక్స్. సుధీర్ వర్మకి థాంక్స్. ఆర్ట్ డైరెక్టర్ వర్మ బెస్ట్ సెట్స్ ఇచ్చారు. అలాగే నవీన్ నూలి సినిమాని చక్కగా తీర్చిదిద్దారు. అల్లు శిరీష్ సినిమాలోనే కాదు రియల్ లైఫ్ హీరో కూడా. శిరీష్ ఈ సినిమాకి ఎవరికైనా డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చి ఉండొచ్చు. కానీ కొత్త డైరెక్టర్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు' అని చిత్ర దర్శకుడన్నారు.