Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల బాలకృష్ణ 'సింహా', 'లెజెండ్' చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. తాజాగా మరోసారి ఆయన డ్యుయెల్ రోల్లో కనిపించనున్నారట. ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో
బాలకృష్ణ ఓ సినిమాలో నటిస్తున్నారు. సి.కళ్యాణ్ నిర్మించే ఈ సినిమా ఈ నెల 17న ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌ని జరుపుకోనుంది.
ఇందులో విలన్ పాత్రలో జగపతిబాబు ఎంపికయ్యారు. 'లెజెండ్' తర్వాత బాలకృష్ణతో జగపతిబాబు విలన్‌గా నటించబోతున్న చిత్రమిది.
అంతేకాదు తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఓ నెగటివ్ రోల్లో కనిపిస్తుందనే వార్త వినిపిస్తుంది. ఇదిలా ఉంటే, బాలకృష్ణ ఇందులో కవలలుగా కనిపించనున్నారట. ఓ పాత్ర చాలా ఎమోషనల్‌గా సాగుతుందని సమాచారం. మరో పాత్రలో పవర్ఫుల్ పోలీస్ కనిపిస్తారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకి 'రూలర్' అనే పేరు కూడా వినిపిస్తోంది. నిర్మాత సి.కళ్యాణ్‌కి చెందిన సి.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ టైటిల్‌ని ఛాంబర్లో రిజిస్టర్ చేయించారట. కథానుగుణంగా బాలకృష్ణ పాత్రని ప్రతిబింబించేలా ఈ టైటిల్ ఉందని ఆయన అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.