Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం రూపొందుతుంది. 'డబుల్ దిమాక్' అనేది ట్యాగ్‌లైన్. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నేడు(బుధవారం) హీరో రామ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేస్తూ,'ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇటీవల చిత్ర టాకీ పార్ట్ పూర్తయ్యింది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. అందులో భాగంగా గోవాలో రామ్, నభా నటేష్‌లపై ఓ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నాం. భాను డాన్స్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. రామ్ బర్త్‌డే కానుకగా బుధవారం టీజర్‌ని విడుదల చేస్తాం. ఆద్యంతం ఎనర్జిటిక్‌గా సాగే ఈ సినిమా అన్ని వర్గాలని ఎంటర్టైన్ చేస్తుంది' అని అన్నారు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, ఉసధాంశు పాండే ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: రాజ్ తోట, ఆర్ట్: జానీ షేక్, ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ.