Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేన్స్ చలన చిత్రోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ 72వ ఇంటర్నేషనల్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మంగళవారం సాయంత్రం మొదలైంది. ప్రపంచ నటీమణులు కనువిందు చేసే దుస్తులు ధరించి, తమ అందాలతో మంత్రముగ్ధుల్ని చేశారు. రెడ్‌కార్పెట్‌పై వాక్ చేస్తూ చూపరులను మెస్మరైజ్ చేశారు. వారి అందాలని బంధించేందుకు కెమెరా కన్నులు పోటీపడ్డాయి. తొలిరోజు ఓపెనింగ్ ఫిల్మ్‌గా 'ది డెడ్ డోన్ట్ డై' అనే సినిమాని ప్రదర్శించారు. ప్రముఖ పాప్ గాయని సెలీనా గోమేజ్ ఎర్ర తివాచీపై హోయలు పోయారు. తొలిరోజు ఆమె హైలైట్‌గా నిలిచింది. అలాగే భారత్‌కి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ వేడుకలో పాల్గొన్నారు. 'ది డెడ్ డోన్ట్ డై' చిత్ర ప్రీమియర్‌లో భాగంగా నిర్వహించిన రెడ్ కార్పెట్‌లో వరుసగా ఎల్లె ఫన్నింగ్, టిల్డా స్వింటన్, సెలేనా గోమెజ్, ఎవా లాంగోరియా, జూలియానె మూర్, గాంగ్ లీ, నటాలియా జనోస్జెక్, ఏంజెలె, లియు టావో, బార్బారా మీర్, అరయ హర్గేట్, చ్లోయి సెవిగ్నీ, అలెసాండ్రో అంబ్రోసియో, అమిరా కాసర్, కారోలినె డె మార్గెట్, లూసి బౌర్గోయిన్, హిఫిట్ గోలాన్, ఎస్టెల్లె లెఫెబురె, రోమీ స్ట్రిజిద్, ఆండ్రీ లామీ, మచ్చా మెరిల్, వర్జినీ లెడోయెన్, నదినె లబాకి, నీవెస్ అల్వెరెజ్, జెసికా జంగ్ వంటి కథానాయికలతోపాటు అలెక్ లుట్జ్, యారోల్ పౌపాడ్ నటులు కూడా రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. తొలి రోజు అద్యంతం సందడిగా సాగింది. దాదాపు పన్నేండు రోజుల పాటు జరిగే ఈ వేడుక ఈ నెల 14న ప్రారంభమైంది. ఈ నెల 25తో ముగుస్తుంది. ఇక ఇండియా నుంచి పలువురు బాలీవుడ్ కథానాయికలు ఈసారి కూడా సందడి చేయబోతున్నారు. వారిలో ఐశ్వర్యరారు, దీపికా పదుకొనె, సోనమ్ కపూర్, కంగనా రనౌత్, హ్యూమా ఖురేషి, మల్లికా షెరావత్, హినా ఖాన్ ప్రధానంగా ఉన్నారు. వీరితో పాటు గ్లోబల్ స్టార్ ప్రియాంక కూడా ఎంపికయ్యారు. తొలిసారి ఆమె తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి సందడి చేయనుంది. ఇప్పటికే ప్రియాంక కేన్స్‌కి చేరుకుంది. వీరంతా ట్రెండీ డ్రెసెస్ ధరించి ఎర్ర తివాచీపై హల్చల్ చేయనున్నారు. ఈ నెల 20, 21న సోనమ్ కపూర్, 16న దీపికా పదుకొనె, 16 నుంచి 18 వరకు మూడు రోజులపాటు కంగనా రనౌత్, ఈ నెల 19, 20న హ్యూమా ఖురేషి, 19న ఐశ్వర్య రారు ఎర్ర తివాచీపై మెరవనున్నట్టు తెలుస్తుంది. హినా కాన్ ఈ నెల 17న ఆహుతులను మెస్మరైజ్ చేసేందుకు రెడ్‌కార్పెట్‌పైకి రాబోతున్నారు. ఇదిలా ఉంటే ఎర్రతివాచీపై నాజుగ్గా కనిపించడం కోసం కంగనా కసరత్తులు చేస్తుంది. దాదాపు ఐదు కేజీలు తగ్గింది.