Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అజిత్ రూటే సపరేట్. ఆయన ఒక్కసారి ఓ దర్శకుడిని నమ్మితే ఆ దర్శకుడితో ఎన్ని సినిమాలైనా చేసేందుకు సిద్ధంగా ఉంటారు. శివతో ఇప్పటికే 'వీరం', 'వేదాలం', 'వివేగం', 'విశ్వాసం' ఇలా నాలుగు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేశారు. ఈ నాలుగూ మంచి విజయాలు సాధించాయి. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ 'పింక్' తమిళ రీమేక్‌లో నటిస్తున్నారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'నేర్కొండ పారావై' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని దర్శకుడు వినోద్ డీల్ చేసిన విధానం అజిత్‌కి బాగా నచ్చిందట. దీంతో తన నెక్ట్స్ సినిమాని కూడా వినోద్ దర్శకత్వంలోనే చేయాలని నిర్ణయించుకున్నారట. ఇక 'నేర్కొండ పారావై' ఆగస్ట్‌లో విడుదల కానుంది. తన 60వ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేస్తారట.