Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేన్స్ వేడుకల్లో మూడో రోజు బాలీవుడ్ తారల సందడి హైలైట్‌గా నిలిచింది. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె, కంగనా రనౌత్ ముగ్గురు ఒకేరోజు కేన్స్ రెడ్‌కార్పెట్‌పై హల్చల్ చేసి వీక్షకులను మెస్మరైజ్ చేశారు. ఆఫ్ షోల్డర్ గౌనులో సింపుల్‌గా రెడీ అయిన ప్రియాంక మన భారతీయ సంప్రాదాయం ప్రకారం రెండు చేతులు జోడించి నమస్కరించడం అభినందనీయం. అంతేకాదు తొలిసారి గ్రాండ్‌గా కేన్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక దీపికా పదుకొనె వైట్, బ్లాక్ కాంబినేషన్లో హై పోనీటెయిల్ గౌన్‌లో చూడముచ్చటగా తయారై చూపరులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఇక ఈ వేడుకలో మరో బాలీవుడ్ నటి కంగనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మన దేశానికి చెందిన చేనేతలు తయారు చేసిన కాంజీవరం బంగారు చీరని ధరించి కేన్స్‌లో మెరవడం విశేషం. చేతికి పర్పుల్ రంగు గ్లౌజులు ధరించి విభిన్నమైన లుక్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. చేనేత కార్మికులను ప్రోత్సహించే ఉద్దేశంతో, వారికి పూర్వ వైభవం తీసుకురావాలనే కాన్సెప్ట్‌తో కంగనా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. రెడ్ కార్పెట్‌కి ముందు దీపిక, కంగనా రనౌత్, ప్రియాంక డిఫరెంట్ డ్రెస్సెస్ ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. స్టన్నింగ్ లుక్‌తో ఆకర్షిస్తున్నారు. వీరంతా 'రాకెట్‌మ్యాన్' చిత్ర ప్రీమియర్‌లో భాగంగా నిర్వహించిన రెడ్ కార్పెట్‌లో సందడి చేయడం విశేషం. కేన్స్‌లో ప్రియాంక చోప్రాకిదే ఫస్ట్ టైమ్ కాగా, కంగనాకిది రెండోసారి, దీపికా మూడోసారి పాల్గొన్నారు. బాలీవుడ్ హీరోయిన్లతోపాటు ప్రపంచ సుందరీ మణులు సైతం అందరినీ ఫిదా చేశారు. 'రాకెట్‌మ్యాన్' ప్రీమియర్‌లో హాలీవుడ్ నటి ఎవా లాంగోరియా, థాయి నటి, మోడల్ ప్రాయా లండ్బెర్గ్, మరో మోడల్, నటి బెల్లా హడిడ్, పోర్చుగీస్ మోడల్, నటి సారా సాంపాయియో, 'జురాసిక్ వరల్డ్' నటి బ్రైస్ డల్లాస్ హోవర్డ్, బ్రెజిల్ సూపర్ మోడళ్ళు ఇసబెలి ఫాంటానా, ఇజాబెల్ గౌలార్ట్, ఆంగోలన్ మోడల్ మారియా బార్గెస్, బర్లెస్య్కూ డాన్సర్ డిటా వాన్ టీస్, అమెరికన్ మోడల్ గెలిలా బెకెల్ ఎర్ర తివాచీపై ఉత్సాహ భరితంగా వాక్ చేస్తూ కనువిందు చేశారు. 'రాకెట్‌మ్యాన్'తోపాటు 'అట్లాంటిక్', 'సారీ విరు మిస్డ్ యు', 'ది షైనింగ్', 'పెయిన్ అండ్ గ్లోరీ' చిత్రాలని ప్రదర్శించారు. ఇందులో ప్రధానంగా 'రాకెట్‌మ్యాన్' చిత్రం బృందం పాల్గొని ప్రత్యేకంగా సందడి చేసింది.