Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తేజశ్వీని మనోజ్ఞ, త్రియుగ మంత్రి, రాజసింహ వర్మ ముఖ్య పాత్రధారులుగా వెంకటేష్ గోపాల్ దర్శకత్వంలో డివిజన్ ఆఫ్ బ్రహ్మకుమారీస్ సమర్పణలో డివైన్ విజన్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐఎంఎస్‌రెడ్డి, జగ్మోహన్ గర్గ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'గాడ్ ఆఫ్ గాడ్స్'.
ఈ చిత్ర పోస్టర్, ట్రైలర్, ఆడియో లాంచ్ శనివారం జరిగింది. అతిథిగా విచ్చేసిన నిర్మాత దిల్‌రాజు ట్రైలర్‌ని, ఆడియో బిగ్ సీడీని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ, 'మన భారతదేశంలో ఉన్నన్ని మతాలు మరే దేశంలోనూ ఉండవు. అయినా మనదేశంలో ఎమోషన్స్ అనేవి చాలా ఎక్కువ. అవి ఇప్పటికీ ఇంకా అలానే ఉన్నాయి. బ్రహ్మ కుమారీస్ వాళ్ళు మున్ముందు ఇలాంటి సినిమాలు తీయాలనుకుంటే నా సహకారాన్ని అందిస్తా. ఈ సినిమా విడుదలకు నా నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా అందిస్తా' అని అన్నారు. 'తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం స్పిరిట్యువల్ ఆర్గనైజేషన్స్ నుంచి వస్తుంది. చెడు నుంచి మంచి రావాలంటే ఏం చేయాలనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది. మనోజ్ఞ ఈ పాత్రకి చాలా కరెక్ట్‌గా సూట్ అయింది. ఆమె ఒక డాక్టర్. వాణిజ్య అంశాలు, సందేశం మేళవించిన చిత్రమిది. నిస్వార్ధంగా సేవ చేసే బ్రహ్మకుమారీస్ సర్వీస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వీళ్ళ భక్తులు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నారు. వారు చూసినా ఈ సినిమా 'మహర్షి' అంతటి విజయం సాధిస్తుంది' అని నిర్మాత సాయివెంకట్ తెలిపారు. తేజశ్వీని మనోజ్ఞ మాట్లాడుతూ, ఈ చిత్రంలో నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మొదటి సినిమానే ఇంత మంచి డివోషన్‌కి సంబంధించి చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా' అని చెప్పారు. 'ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. ఐదేండ్లపాటు రీసెర్చ్ చేసి తీశా. బోర్ కొట్టదు. హిందీలో మంచి స్పందన రావడం హ్యాపీగా ఉంది. శాంతి, ప్రేమ విలువలతోకూడిన నవ ప్రపంచ పునరుద్ధరణ మహాకార్యం వంటిది ఈ చిత్ర కథాంశం' అని చిత్ర దర్శకుడు వెంకటేష్ తెలిపారు. నిర్మాత ఐ.ఎం.ఎస్‌రెడ్డి చెబుతూ, 'ఇది భక్తిరస చిత్రమనుకుంటున్నారు. గాడ్ గురించి ఎవరికీ క్లారిటీ లేదు. ఇందులో ఆ స్పష్టత ఇస్తున్నాం. జూన్ 1న విడుదల చేస్తాం' అని చెప్పారు.