Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గతంలో మహేష్‌బాబు హీరోగా రూపొందిన 'పోకిరి'ని 'వాంటెడ్'గా రీమేక్ చేసి సల్మాన్‌ఖాన్ భారీ సక్సెస్ అందుకున్న విషయం విదితమే. తాజాగా బ్లాక్‌బస్టర్ సాధించిన మహేష్ 'మహర్షి' చిత్రాన్ని కూడా రీమేక్ చేసే ఆలోచనలో సల్మాన్ ఉన్నారట. ప్రభుదేవా, సల్మాన్ ఖాన్ కోసం ప్రత్యేకంగా షో వేయ బోతున్నారట. ఈ రీమేక్‌కి ప్రభుదేవా దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎందుకంటే 'వాంటెడ్' చిత్రానికి ప్రభుదేవానే దర్శకత్వం వహించారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లోనే 'దబాంగ్ 3' సినిమా షూటింగ్ ఏకధాటిగా జరుగుతోంది. ఇదిలా ఉంటే, 'మహర్షి' చిత్రాన్ని తమిళంలో విజయ్ రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.