Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజరు దేవరకొండ హీరోగా రూపొందుతున్న నూతన చిత్రం 'హీరో'. మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తుండగా, ఆనంద్ అన్నామలై దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, మోహన్(సీవీఎం) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆదివారం ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు కొరటాల శివ క్లాప్ నిచ్చారు. చిత్ర దర్శకుడికి స్క్రిప్ట్‌ని అందించారు. ఎమ్మెల్యే రవికుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేస్తూ, 'స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో మ్యూజికల్ థ్రిల్లర్ జోనర్ ఈ సినిమా తెరకెక్కుతుంది. విజరు దేవరకొండ మొదటిసారి ఇలాంటి డిఫరెంట్ జోనర్ సినిమాల్లో నటిస్తున్నారు. మాళవిక మోహనన్ ఈ సినిమాతో కథానాయికగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. త్వరలో సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాం' అని తెలిపింది. దిగంత్ మచాలే, వెన్నెల కిషోర్, శరణ్ శక్తి, రాజా కృష్ణమూర్తి(కిట్టి), జాన్ ఎడతట్టిల్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రదీప్ కుమార్, కెమెరా: మురళీ గోవిందరాజులు, ఎడిటర్: ఆనంద్ అన్నామలై.