Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభని చాటిన పేద కళాకారులకు ఆర్.కె.కళా సాంస్కృతిక ఫౌండేషన్ అందించే ఫేమస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, మాస్టర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లను అందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధినేత డా||రంజిత్ కుమార్ మాట్లాడుతూ, 'కనుమరుగవుతున్న భారత కళలను పున:ప్రారంభించేందుకు అంతర్జాతీయ స్థాయిలో సకలకళా యజ్ఞం ప్రారంభిస్తున్నాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సకలకళా యజ్ఞం పోస్టర్ని దైవజ్ఞ శర్మ చేతుల మీదుగా ఆవిష్కరించాం. వివిధ విభాగాల్లో ప్రతిభని చాటిన కళాకారులకు ఫేమస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గురువులకు మాస్టర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బహుకరించాం' అని అన్నారు. ఇందులో 200మందికిపైగా కళాకారులు, ముఖ్య అతిథులతోపాటు భారీగా ఎన్టీఆర్ అభిమానులు పాల్గొని సక్సెస్ చేశారు.