Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఓ బేబీ'. బి.వి.నందిని రెడ్డి దర్శకత్వంలోరూపొందుతున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్ పతాకాలపై సురేష్‌బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యూవు థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా మంగళవారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేస్తూ, 'అత్యద్భుత నటనతో పాత్రలకు ప్రాణం పోస్తూ సినిమా విజయంలో కీలక భూమిక పోషిస్తున్న సమంత ఇందులో ప్రధాన పాత్ర పోషించడం ఆనందంగా ఉంది. ఆమెతోపాటు సీనియర్ నటి లక్ష్మి కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో సమంత, ఆమె వెనకాల లక్ష్మి ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్ని పనులు పూర్తి చేసి జులైలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం' అని చెప్పింది. రావు రమేష్, రాజేంద్రప్రసాద్, ప్రగతి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కి జే మేయర్, కెమెరా: రిచర్డ్ ప్రసాద్, ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ, ఆర్ట్: విఠల్.కె.