Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుదేవా, తమన్నా జంటగా విజరు దర్శకత్వంలో 'అభినేత్రి 2' రూపొందుతుంది. నందితా శ్వేత, సప్తగిరి, సోనూ సూద్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ నామా, ఆర్. రవీంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో 'రెడీ రెడీ..' అంటూ సాగే పాటని మంగళవారం విడుదల చేశారు.ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, 'మూడేండ్ల క్రితం వచ్చిన 'అభినేత్రి' మంచి విజయం సాధించింది. దానికి సీక్వెల్‌గా ఈ సినిమాని రూపొందిస్తున్నాం. ఇందులో థ్రిల్లింగ్ అంశాలతోపాటు మనసుకు నచ్చే ఆహ్లాదకరమైన సన్నివేశాలు పుష్కలంగా ఉంటాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కి అద్భుతమైన స్పందన లభించింది.
సినిమాలో ప్రభుదేవా, తమన్నా, నందితా శ్వేతల నటన హైలైట్‌గా నిలుస్తుంది.
శ్యామ్ సంగీతం అన్ని వర్గాలని అలరిస్తుంది. ఆయాంక బోస్ అందించిన విజువల్స్ పెద్ద ప్లస్ అవుతాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న
ఈ చిత్రాన్ని ఈ నెల 31న విడుదల చేయనున్నాం' అని చెప్పారు.