Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విల్ స్మిత్, మేనా మసూద్ ప్రధాన పాత్రధారులుగా గారు రిచీ దర్శకత్వంలో 'అలాద్దీన్' చిత్రం రూపొందింది. వాల్ట్ డిస్నీ సంస్థ నిర్మించిన ఈచిత్రంలో ప్రధాన పాత్రలకు వెంకటేష్, వరుణ్ తేజ్ వాయిస్‌ని అందించారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'అరేబియన్ నైట్స్ కథల్లో అలాద్దీన్ అద్భుత దీపం కథకి ప్రపంచ వ్యాప్తంగా విశేష అభిమానులున్నారు. వాటి ఆధారంగా ఎన్ని సినిమాలు వచ్చినా, వాటిని ఎన్ని సార్లు చూసినా కొత్తగానే ఉంటాయి. ఇందులో కూడా అలాంటి ఓ కొత్తదనం ఉంటుంది. భారీ బడ్జెట్‌తో కొత్త హంగులు అద్ది ఆడియెన్స్‌ని అరేబియన్ రాజ్యంలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో జీని పాత్రకి వెంకటేష్, అలాద్దీన్ పాత్రకి వరుణ్ తేజ్ వాయిస్ అందించారు. 'ఎఫ్2' వంటి విజయం తర్వాత వెంకటేష్, వరుణ్‌తేజ్ కలిసి ఈ సినిమాకి వాయిస్ అందించడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జీని పాత్రలో విల్ స్మిత్, అలాద్దీన్ పాత్రలో మేనా మసూద్ నటించారు. ఇటీవల డిస్నీ మార్వెల్ నుంచి వచ్చిన 'అవెంజర్స్ : ఎండ్ గేమ్' సంచలనం సృష్టించింది. అభిమానులు 'అవెంజర్స్' మానియా నుంచి బయటపడకముందే ఈ సినిమాతో మరో విజువల్ ఫీస్ట్‌ని అందించబోతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఇది దాదాపు 350 థియేటర్లలో విడుదల చేయనున్నాం' అని తెలిపింది.