Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో గతేడాది 'అరవింద సమేత' వచ్చిన విషయం విదితమే. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుందట. ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో ఆయన ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తన తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉంటుందని వెల్లడించారట. 'అరవింద సమేత' చిత్ర టైమ్‌లో త్రివిక్రమ్ మేకింగ్ స్టయిల్ నచ్చి ఆయనతో మరో సినిమా చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారట. తెలుగులో భారీ మల్టీస్టారర్‌గా రూపొందుతున్న 'ఆర్ ఆర్ ఆర్'లో రామ్‌చరణ్‌తో కలిసి ఆయన నటిస్తున్నారు. రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమా మూడో షెడ్యూల్‌కి సిద్ధమైంది. హైదరాబాద్‌లోని అల్లూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్లో షూట్ చేయనున్నారు. ఇందులో ఎన్టీఆర్, రామ్‌చరణ్, అలియా భట్‌తోపాటు ప్రధాన తారాగణం పాల్గొననుందట. రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ నటి అలియా భట్ కథానాయికగా నటిస్తున్న విషయం విదితమే. ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ కోసం గాలిస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ 'ఆర్ ఆర్ ఆర్'కి వివరణ విషయంలో సస్పెన్స్ నెలకొంది. ఎక్కువగా 'రామ రావణ రాజ్యం', 'రాఘుపతి రాఘవ రాజారామ్' పేర్లని సూచిస్తున్నారు.