Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజు రోజుకి రెట్టింపు ఉత్సాహంతో తారలు కేన్స్‌లో సందడి చేస్తున్నారు. ప్రపంచ సుందరాంగులు రంగు రంగుల దుస్తులు ధరించి తమ అందాలతో మెస్మరైజ్ చేస్తున్నారు. తొమ్మిదో రోజు బాలీవుడ్ నటీమణులు హ్యూమా ఖురేషీ, డయానా పెంటి రెడ్ కార్పెట్‌పైకి రాలేదు, కానీ కేన్స్‌లో ఫొటోలకు ఫొజులిచ్చారు. వీరి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక బుధవారం 'ఓ మెర్సీ', 'మాతాయిస్ అండ్ మాక్సిమ్', 'ది గ్యాంగ్‌స్టర్ ది కాప్, ది డెవిల్' చిత్రాల ప్రీమియర్ నిర్వహించారు. ఫ్రెంచ్ చిత్రం 'ఓ మెర్సీ' ప్రీమియర్‌లో లీయా సేడాక్స్, సారా ఫోరెస్టీర్, అర్నాడ్ డెస్ప్లెచిన్, ఆంటోనీ రీనార్ట్జ్, ఇజాబెల్ గౌలార్ట్, ఆడ్రియానా లిమా, సోసెఫిన్ స్క్రీవర్, ఐరిష్ మెట్టెనాయిర్, ఏంజెలా ఇస్మాయిలాస్, ఫెర్నాండా లిజ్, నాటాషా పోలీ, నబిల్లా బెనట్టియా వంటి నాయికలు, 'మాతాయిస్ అండ్ మాక్సిమ్' చిత్ర ప్రీమియర్‌లో మరియాన్ కోటిల్లార్డ్, సోఫియా నికిచుక్, మోనియా చోక్రి, మాయిమౌనా ఎన్డియాయె తదితర హీరోయిన్లు ఎర్రతివాచీలపై తమదైన ట్రెండీ దుస్తులు ధరించి అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు. ఎప్పటిలాగే వారి అందాలను బంధించేందుకు పోటీపడటం కెమెరాల వంతైంది. దీంతోపాటు 'ఐస్ ఆన్ ఫైర్' డాక్యుమెంటరీ ప్రీమియర్‌లో హలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో పాల్గొని రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. పర్యావరణంపై రూపొందించిన ఈ డాక్యుమెంటరీకి లీలా కానర్స్ దర్శకత్వం వహించగా, లియోనార్డో నిర్మించారు. దీనికి కేన్స్‌లో మంచి ప్రశంసలు దక్కాయి. అంతకముందు బ్రాడ్పీట్, లియోనార్డో కలిసి నటించిన 'వన్స్ ఆపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్' చిత్ర ప్రీమియర్‌కి కూడా విశేష స్పందన లభించింది. అంతేకాదు సినిమాకి ఫిదా అయిన ప్రతినిధులు దాదాపు ఆరు నిమిషాల పాటు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారట. దీన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ చిత్రంగా అభివర్ణిస్తున్నారు.