Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీకాంత్, అభరు, మేఘా చౌదరి, రష్మి సమాంగ్ హీరోహీరోయిన్లుగా జై రాజ్ సింగ్ దర్శకత్వంలో 'మార్షల్' చిత్రం రూపొందుతుంది. ఏవీఎల్ ప్రొడక్షన్స్ పతాకంపై అభరు అడకా నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, 'సైంటిఫిక్ థ్రిల్లర్ ప్రధానంగా వినూత్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలని జరుపుకుంటోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కి అద్భుతమైన స్పందన లభించింది. విడుదలైన గంటలోనే అర మిలియన్ వ్యూస్‌ని రాబట్టుకుని అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఇప్పుడు రెండు మిలియన్ వ్యూస్‌ని సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సినిమాపై మా నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది. ఇటీవల కాలంలో ట్రెండ్ సెట్టింగ్ హిట్స్ అందుకున్న సినిమాల జాబితాలో మా సినిమా కూడా నిలుస్తుందని నమ్ముతున్నా' అని అన్నారు. సుమన్, వినోద్ కుమార్, శరణ్య, పృథ్వీరాజ్, రవిప్రకాష్, ప్రియదర్శిని రామ్, ప్రగతి, కల్పవల్లి, సుదర్శన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం :యాదగిరి వరికుప్పల, కెమెరా: స్వామి ఆర్.ఎం, ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్.