Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ హీరోగా, ధన్య బాలకృష్ణ కథానాయికగా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో 'సాఫ్ట్వేర్ సుధీర్' చిత్రం రూపొందుతుంది. ఇంద్రజ కీలక పాత్ర పోషిస్తున్నారు. శేఖర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కె. శేఖర్ రాజు నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి హీరో సుధీర్ మాట్లాడుతూ, 'అందరూ నన్ను హీరో అంటున్నారు. కానీ ఈ సినిమాకి కథే హీరో. దర్శకుడు చెప్పిన కథకి బాగా ఎగ్జైట్ అయ్యాను. ఇంత తక్కువ టైంలోనే ఆడియెన్స్ ఆదరాభిమానాలు పొందడం నా అదృష్టం. ఈ సినిమాతో వారికి మరింత దగ్గరవుతాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు' అని అన్నారు. 'పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సినిమాని రూపొందిస్తున్నాం. కామెడీతో పాటు కమర్షియల్ పంథాలో సాగే ఆసక్తికర కథతో మీ ముందుకు వస్తున్నాం. నేటి తరం సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవితాల్లో ఉండే కష్టసుఖాలు సినిమాలో చూపించాం. మంచి కామెడీ టైమింగ్ ఉన్న సుధీర్‌ని హీరోగా ఎంపిక చేశాం. సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. రెండు పాటల చిత్రీకరణ పూర్తయ్యింది. మిగతా రెండు మోంటేజ్ సాంగ్స్. భీమ్స్ అద్భుతమైన సంగీతంతో పాటు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. రామ్‌ప్రసాద్ కెమెరావర్క్ ఆకట్టుకుంటుంది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చే చిత్రం అవుతుంది' అని దర్శకుడు రాజశేఖర్ చెప్పారు. నిర్మాత కె. శేఖర్ రాజు చెబుతూ, 'సినిమా మీద ఉన్న ఫ్యాషన్‌తో
మంచి కథతో ఈ సినిమాని నిర్మిస్తున్నాం. మొదటి చిత్రమైనా ఖర్చుకు వెనుకాడకుండా మంచి సినిమాని ప్రేక్షకులకు అందివ్వాలనే ఉద్దేశ్యంతో నిర్మిస్తున్నాం. ఇప్పటికే యాభై శాతం టాకీ పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జులై చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'
అని చెప్పారు. 'దర్శకుడు చెప్పిన కథ, మదర్ సెంటిమెంట్ ఇందులో నటించేందుకు ప్రేరేపించాయి. సుధీర్ కామెడీ టైమింగ్ బాగుంది. తను బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. సినిమాలో మంచి ఎమోషన్ కూడా ఉంది' అని ఇంద్రజ చెప్పారు.