Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేన్స్ సందడి చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది జరుగుతున్న కేన్స్ 72వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం పదకొండు రోజులపాటు ఆద్యంతం సందడిగా సాగుతున్న విషయం విదితమే. పదకొండో రోజు మరింత సందడి నెలకొంది. హాలీవుడ్ దిగ్గజం సిల్వెస్టర్ స్టాలోన్ ఈ వేడుకలో సందడి చేయడం విశేషం. ఆయన తన 50ఏండ్ల భార్య జెన్నీఫర్ ఫ్లావిన్, 20ఏండ్ల కూతురు సిస్టినెలతో కలిసి రెడ్ కార్పెట్‌పై వాక్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేడుక ముగింపుకు ముందు రోజు పాల్గొని వేడుకకి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. తన కొత్త సినిమా 'రాంబో 5: లాస్ బ్లడ్' చిత్ర ప్రీమియర్‌లో తన ఫ్యామిలీతో కలిసి పాల్గొనడం హైలైట్‌గా నిలిచింది. అలాగే ప్రముఖ నటులు క్రిస్ టకర్, డెస్టిన్ క్రిస్టోఫర్ టకర్, పాజ్ వెగా, పార్టిసియా కాంట్రెరాస్, మెరెడిత్ మైఖెల్సన్తోపాటు చిత్ర బృందం ఈ ప్రీమియర్‌లో సందడి చేశారు. వీరితోపాటు 'సిబైల్' చిత్ర ప్రీమియర్‌లో భాగంగా ఏర్పాటు చేసిన రెడ్‌కార్పెట్‌లో ఒలివియా కల్పో, షానినా షేక్, మిల్లా జోవోవిచ్, మారియా కరే, పాట్రిసియా అర్యూట్టె, హార్లా ఒలివియా కలియోప్ తదితరులు తీరైన దుస్తులు ధరించి ఎర్రతివాచీపై హొయలు పోతూ ఫొటోలకు పోజులిచ్చారు. వారిని బంధించేందుకు ఎప్పటిలాగానే కెమెరాలు పోటీపడ్డాయి. నేడు విజేతలని నిర్ణయిస్తారు.