Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్కీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'సాహో'. ఈ చిత్రానికి సంబంధించి కొత్త పోస్టర్‌ను సోమవారం ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనికి విశేషమైన స్పందన లభిస్తున్న నేపథ్యంలో నిర్మాతలు మాట్లాడుతూ, 'రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇప్పటికే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన 'షేడ్స్ ఆఫ్ సాహౌ చాప్టర్ 1' కి ఇండియా మెత్తం క్రేజ్ వచ్చింది. ప్రపంచంలో ఉన్న రెబెల్‌స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. 'షేడ్స్ ఆఫ్ సాహౌ 2'తో ఈ చిత్రం హీరోయిన్ శ్రద్ధా కపూర్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన వీడియోకు అత్యద్భుమైన స్పందన లభించింది. ఈ స్పెషల్ వీడియోలో శ్రద్దా కపూర్ క్యారెక్టర్ లుక్‌ని రివీల్ చేశాం. ఈ మేకింగ్ వీడియోతో ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థమవుతుంది. ఇటీవల ప్రభాస్ స్వయంగా చిత్ర ప్రమోషన్స్‌ని ప్రారంభించారు. ఇందులో భాగంగా న్యూ లుక్ పోస్టర్‌ను ఇన్స్టాగ్రామ్ ద్వారా విడుదల చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ అత్యధికంగా గూగుల్ సెర్చ్ చేయటం రికార్డ్‌గా నిలిచింది. తాజాగా రిలీజ్ చేసిన సర్ప్రైజ్ పోస్టర్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే 5 లక్షల లైక్స్ రావడం విశేషం. అలాగే 24 గంటల్లో దాదాపు 8 లక్షల లైక్స్ రావడం తెలుగు సినిమాకి సంబంధించి ఇదొక రికార్డ్. ఇక తాజాగా సోమవారం విడుదల చేసిన కొత్త పోస్టర్‌కి విశేష స్పందన లభించడం చాలా ఆనందంగా ఉంది. విడుదల చేస్తున్న ప్రతీ పోస్టర్ సినిమాపై మరిన్ని అంచాలను పెంచుతున్నాయి. అత్యాధునిక డినో యురి 18కెడబ్ల్యూ సాకేంతిక పరిజ్ఞానంతో ఈ సినిమా విజువల్స్‌ని క్యాప్చర్ చేయడం మరో విశేషం. ఇంతటి భారీ ప్రతిష్టాత్మక చిత్రానికి 'రన్ రాజా రన్' చిత్రంతో సూపర్‌హిట్ అందుకున్న సుజీత్ దర్శకత్వం వహించడం మరింత సంతోషంగా ఉంది. హైటెక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్నారు. ప్రేక్షకులు, అభిమానుల అంచనాలను అందుకునేలా 'సాహో'లో ప్రభాస చాలా స్టయిలీష్‌గా, ఓ కొత్త ఎనర్జీతో కనిపించబోతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న గ్రాండ్‌గా ఏకకాలంలో తెలుగు, తమిళం, హిందీతోపాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నాం' అని అన్నారు.