Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ నెల 31న కృష్ణ తన 76వ పుట్టినరోజుని జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ బర్త్‌డే వేడుకను ఆయన తనయుడు మహేష్‌బాబు అత్యంత వైభవంగా చేయాలను కుంటున్నారని సమాచారం. అంతే కాదు ఆయనకు బర్త్‌డే కానుకగా తన 26వ సినిమా గురించి ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇటీవల సంచలన విజయం సాధించిన 'మహర్షి' చిత్రానికి సంబంధించిన సక్సెస్ఫుల్ ఈవెంట్‌ని కూడా ఇదే వేడుకలో నిర్వహించేందుకు 'మహర్షి' చిత్ర బృందం సన్నాహాలు చేస్తోందట. మహేష్‌బాబు, అనిల్‌రావిపూడి కాంబినేషన్లో రూపొందబోయే సినిమా షూటింగ్ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదిఏమైనా భిన్న, వైవిధ్య, ప్రయోగాత్మక సినిమాలతో తెలుగునాట ఓ హిస్టరీ క్రియేట్ చేసిన తండ్రి కృష్ణకి తగ్గ తనయుడిగా మహేష్‌బాబు సైతం అద్భుతమైన సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లను అందుకోవడం విశేషం.