Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గుణ 369'. స్ప్రింట్ ఫిల్మ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బుధవారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. చిత్ర దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ, 'ఇటీవల ఒంగోలులో చిత్రీకరించిన భారీ షెడ్యూల్‌తో చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొత్త తరహా కథలతో ఇతర భాషల్లో సినిమాలు వస్తున్నట్టు, తెలుగులో రావడం లేదనే బాధను మా సినిమా తీరుస్తుంది. కంటెంట్ పరంగా ఆద్యంతం కొత్తగా ఉంటుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన కాసేపటికే చాలా మంది ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నారు. పోస్టర్ వైవిధ్యంగా ఉందని మెచ్చుకుంటున్నారు. సర్వత్రా పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి' అని అన్నారు. 'సినిమా చాలా బాగా వస్తోంది. పాటలు కూడా వినగానే ఆకట్టుకునేలా ఉంటాయి. కార్తికేయని కొత్త లుక్‌లో చూస్తారు. 'ఆర్ ఎక్స్ 100'లోని పాత్రకు, ఈ చిత్రంలో కార్తికేయ పాత్రకూ చాలా వైవిధ్యం ఉంటుంది. నటుడిగా కార్తికేయ ఈ చిత్రంలో మరింతగా విజృంభించారు. పంచెలుక్కులో కార్తికేయ కొత్తగా ఉన్నారు. ఆయన కెరీర్లో నిలిచిపోయే సినిమా అవుతుంది. మా తొలి చిత్రం ఇంత బాగా వస్తున్నందుకు నిర్మాతలుగా మేం చాలా ఆనందిస్తున్నాం. గొప్ప టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. అందరినీ మెప్పించే చిత్రమవుతుంది' అని నిర్మాతలు తెలిపారు.