Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సినీ చరిత్రలో కృష్ణకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. భిన్న, వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతోపాటు ఎంతో ధైర్యంగా ప్రయోగాల్ని చేశారు. ఆయన 77వ పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా) సభ్యులు ఆయన్ని నానక్ రామ్‌గూడలోని నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, బర్త్‌డే విషెస్ తెలిపారు. అలాగే బర్త్‌డే కేక్‌ని కట్ చేసి ఘనంగా వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణతో తమకున్న అనుబంధాన్ని, ఆయన సినిమాల్లోని ప్రత్యేకతని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ సతీమణి, నటి, దర్శకురాలు విజయనిర్మల, 'మా' అధ్యక్షుడు నరేష్, ఉపాధ్యక్షుడు హీరో రాజశేఖర్, కార్యదర్శి జీవితా రాజశేఖర్, సురేష్కొండేటితోపాటు ఇతర 'మా' సభ్యులు పాల్గొన్నారు.