Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమీర్ ఖాన్, శైలజ జంటగా షేర్ దర్శకత్వంలో చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'కేఎస్ 100'. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి నిర్మాత వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, 'ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌కి విశేష స్పందన లభించింది. హర్రర్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుని ఎలాంటి కట్స్ లేకుండా 'ఏ' సర్టిఫికేట్ పొందింది. హర్రర్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. సినిమా చాలా బాగా వచ్చింది. కచ్చితంగా అన్ని వర్గాలను ఆకట్టుకునే చిత్రం అవుతుంది. ఈ నెల 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు. 'చిత్ర ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. సినిమా బాగా రావడానికి సహకరించిన చిత్ర బృందానికి థ్యాంక్స్. ఆదరించాలని కోరుకుంటున్నా' అని చిత్ర దర్శకుడు తెలిపారు. అక్షిత, అషి, పూర్వి, సునీత, శ్రద్ధా, నందిని, కల్పన అజీమ్, సుమన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: నవనీత్ చారి, కెమెరా: వంశీ, ఎడిటర్: లోకేష్ చందు, నాగార్జున.ఆర్ట్: సుదర్శన్.