Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తికేయ హీరోగా జె.డి.చక్రవర్తి కీలక పాత్రధారిగా టి.ఎన్.కృష్ణ దర్శకత్వంలో వీ క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న చిత్రం 'హిప్పీ'. దిగంగన కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జె.డి. చక్రవర్తి మాట్లాడుతూ, 'ప్రొడ్యూసర్ అనే పదంలో సర్ అని ఉంటుంది. దానికి థాను సర్ కరెక్ట్‌గా సూట్ అవుతారు. ఆయన పొయెటిక్ పర్సన్. మంచి మ్యూజిక్ సెన్స్ ఉంది. దర్శకుడు కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. నా జీవితంలో రామ్‌గోపాల్ వర్మ అనే రాముడున్నాడు. ఆయన కృష్ణలీలలకు ఫేమస్. ఈ కృష్ణ రామ తత్వానికి ఫేమస్. హీరో కార్తికేయకు కెమెరా ముందు తప్ప కెమెరా వెనుక యాక్టింగ్ చేయడం రాదు. తనతో వర్క్ చేయడాన్ని ఎంజారు చేశాను. టీమ్‌కి నా అభినందనలు' అని అన్నారు.
'నేను ఈ సినిమాని కార్తికేయతో చేయడానికి ప్రధాన కారణం తన కళ్లే. పవర్‌ఫుల్‌గా ఉండే తన కళ్లను చూసే తనతో సినిమా చేయాలనుకున్నాను. తను రాకింగ్ హీరో అవుతాడు. కార్తి ప్లేబారు, లవర్ బారు కాదు, స్పాంటేనియస్ బారు. 'హిప్పీ' పాత్ర అలానే ఉంటుంది. జె.డి.చక్రవర్తి చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేశారు. ఆయనతో పనిచేయడం ఆనందంగా ఉంది. దిగంగన సహజమైన నటి. తమిళంలో అప్‌కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ నవాస్ ఈ సినిమాకి మంచి ఆత్మతో కూడిన సంగీతాన్ని అందించారు. నిర్మాత థాను లేకుంటే ఈ సినిమా లేదు. సినిమా వంద శాతం పెద్ద హిట్ అవుతుంది' అని చిత్ర దర్శకుడు తెలిపారు.
హీరో కార్తికేయ మాట్లాడుతూ, 'జూలై 12, 2018 నాకు పునర్జన్మ దక్కినరోజు. ఆ రోజు 'ఆర్ ఎక్స్ 100' విడుదలైంది. ఈ సినిమా లేకపోతే నేను లేను. అందరి ఆశీర్వాదాలతో ఓ చిన్నబాబులా ఈ చిత్రంతో తొలి అడుగు వేయబోతున్నా. నేను హీరో అయితే చాలు, నా సినిమాను కొంత మంది చూస్తే చాలు అనుకునేవాడిని. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టబోతున్నాం. ఈ నమ్మకానికి కారణం దర్శకుడు. 'ఆర్.ఎక్స్ 100' తర్వాత నేను లవ్ ఫెయిల్యూర్‌కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాను. ఇందులో ఇద్దరమ్మాయిలతో తిరుగుతూ ఫిలాసఫీ చెబుతుంటాను. ప్రతి అబ్బాయి అమ్మాయితో ఉన్నప్పుడే మరో అమ్మాయిని చూడాలనుకుంటాడు. ప్రతి ఒక్కరిలోనూ ఈ ఎమోషన్ ఉంటుంది. ప్రతి సీన్లో మీరు, మీ స్నేహితులు కనిపిస్తారు. రజనీకాంత్ వంటి పెద్ద స్టార్‌తో సినిమా చేసిన పెద్ద నిర్మాత థాను నాతో సినిమా చేయడం మర్చిపోలేను. జె.డి.చక్రవర్తి ఎనర్జీ లెవల్స్ సూపర్బ్. జూన్ 6న గట్టిగా కొడుతున్నాం. నేను ఒక్కడినే కాదు.. మీరు కూడా షర్ట్స్ విప్పి ఎగరేస్తారు. అందరం హిప్పీలుగా మారిపోతాం' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అజరు భూపతి, అనంత శ్రీరామ్, తిరుమల రెడ్డి, హరితేజ తదితరులు పాల్గొన్నారు.