Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శృతి హాసన్ మంచి నటి మాత్రమే కాదు, అద్భుతమైన గాయని అనే విషయం తెలిసిందే. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రత్యేక ఆల్బమ్స్లోనే కాదు, సినిమాల్లోనూ పాటలు పాడుతూ శ్రోతలతోపాటు ప్రేక్షకులనూ మెప్పిస్తోంది. తాజాగా తమన్నా కోసం ఓ పాట పాడిందట. తమన్నా హిందీలో 'ఖామోషి' చిత్రంలో నటిస్తుంది. హర్రర్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభుదేవా హీరోగా నటిస్తున్నారు. చక్రి తోలేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ షమిర్ టాండన్ ఆధ్వర్యంలో శృతి పాడిన టైటిల్ సాంగ్ అద్భుతంగా వచ్చిందని, ఆ టైటిల్ సాంగ్ మీకూ నచ్చుతుందని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే, శృతి చాలా రోజుల తర్వాత తెలుగులో మళ్ళీ రవితేజ సరసన నటించేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చింది. గోపీచంద్ మలినేని,రవితేజ కాంబినేషన్లో రూపొందబోయే సినిమాలో కథానాయికగా శృతిని ఎంపిక చేశారు. గతంలో రవితేజ, శృతి జంటగా 'బలుపు' సినిమా వచ్చిన విషయం విదితమే. ఆ సినిమాకి కూడా గోపీచంద్ మలినేనే దర్శకుడు కావడం విశేషం. శృతి హాసన్ చివరగా తెలుగులో 'కాటమరాయుడు'లో మెరిశారు. ప్రస్తుతం హిందీలో 'పవర్', తమిళంలో 'లాబమ్' చిత్రాల్లో నటిస్తూ శృతి బిజీగా ఉంది.