Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలీ హీరోగా దిలీప్ రాజా దర్శకత్వంలో పెదరావురు ఫిల్మ్ సిటీ పతాకంపై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'పండుగాడి ఫొటో స్టూడియో'. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ, 'సినిమాలో హీరో అలీ ఎవరికి ఫొటో తీస్తే వారికి పెళ్ళి అయిపోతుంది. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఆద్యంతం ఆసక్తికర సన్నివేశాల సమాహారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సినిమాలోని పాత్రలు విలక్షణంగా, పాత్రల పేర్లు వైవిధ్యంగా ఉంటాయి. పండుగాడు, కంచు, కనకరత్నం, మిలట్రీ మావ, గొడుగు గోవిందం, చెంబులింగం, మెంటల్ లచ్చిమి వంటి పేర్లతో పాత్రలు అలరిస్తాయి. నూతన నటీనటులు సందీప్ రాజా, టీనా చౌదరి విభిన్న పాత్రలు పోషించారు. యాజమాన్య సారథ్యంలోని పాటలకు శ్రేయాఘోషల్, మనీషా చక్కని గానం అందించారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల చివరి వారంలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు. రిషిత, వినోద్ కుమార్, బాబుమోహన్, సుధ, జీవ, శ్రీలక్ష్మీ, రాంజగన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: నందమూరి హరి, కెమెరా: మురళీమోహన్‌రెడ్డి.