Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ దేవరకొండ హీరోగా, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఏ.వల్లభ నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్,
ఇజాబెల్లె దె హీరోయిన్లుగా నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి యూనిట్ తెలియజేస్తూ, 'రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ ఎంటర్టైనర్గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఫ్రాన్స్‌లో జరుగుతుంది. ఫ్రాన్స్‌లో లాంగ్ షెడ్యూల్‌కి దర్శక, నిర్మాతలు ప్లాన్ చేశారు. ఇందులో విజరు దేవరకొండతో పాటు ఇతర ప్రధానతారాగణం పాల్గొంటుంది. అవుట్‌ఫుట్ చాలా బాగా వస్తుంది' అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : గోపీసుందర్, కెమెరా: జేకే.