Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆర్ఎక్స్ 100 తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలో, ఎలాంటివి చేయకూడదో నాకు బాగా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఎటువంటి కన్ప్యూజన్ లేదు. నాకు నచ్చితే 100 శాతం నమ్మి చేస్తాను. అలా చేసింది 'హిప్పీ' సినిమా' అని అంటున్నారు కథానాయకుడు కార్తీకేయ. టి.ఎన్.కృష్ణ దర్శకత్వంలో కార్తీకేయ హీరోగా వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ధాను నిర్మించిన చిత్రం 'హిప్పీ'. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని నేడు (గురువారం) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ నేపథ్యంలో కథానాయకుడు కార్తీకేయ మీడియాతో ముచ్చటించారు. 'ఆర్ఎక్స్ 100' తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంతకముందు జీరోగా ఉన్న నన్ను ఓ ఆర్ఎక్స్ 100 ఓ రేంజ్‌కి తీసుకెళ్ళింది. దాని తర్వాత చేసిన ఈ సినిమా మీద ప్రెజర్ కచ్చితంగా ఉంది. అయితే ఈ సినిమా చాలా బాగా వచ్చింది. నేను కూడా బాగా చేశానని నమ్ముతున్నా. నాలోని డిఫరెంట్ షేడ్స్‌ను ఆడియెన్స్‌కి చూపించబోతున్నా. సినిమా చూశాక నా గురించి ఏమంటారు?, నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారనే విషయాల పట్ల చాలా ఆసక్తిగా ఉన్నా. తొలి సినిమా తర్వాత ఎలాంటి కథల్ని ఎంపిక చేసుకోవాలి?, ఎలాంటి కథల్ని చేయకూడదనే విషయాల్ని బాగా తెలుసుకున్నా. చేసే ప్రతి ప్రాజెక్ట్‌ను స్పష్టమైన అవగాహనతో చేస్తున్నా. ఇక ఈ సినిమాలోని రొమాంటిక్ సీన్స్ గురించి అందరూ అడుగుతున్నారు. 'ఆర్ఎక్స్100'లోని రొమాంటిక్ సీన్స్‌తో పోలిస్తే ఈచిత్రంలోని రొమాంటిక్ సన్నివేశాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. నా వయసుకి తగ్గట్టే లవ్‌స్టోరీస్ వస్తున్నాయి. వాటిల్లో కచ్చితంగా రొమాంటిక్ మూమెంట్స్ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కచ్చితంగా లిప్‌లాక్స్ చేయాల్సిందే. అలా కాకుండా పాత కాలంలో మాదిరిగా గొడుగు అడ్డం పెట్టేసినట్టు చూపిస్తే బాగుండదు కదా(నవ్వుతూ). పైగా ఒక రియలిస్టిక్ సినిమా చేయాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగానే అందులోని అంశాలన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉండాలి. కథానుగుణంగా ఇందులో నేను చాలా గెటప్స్‌లో కనిపిస్తాను. వాటిల్లో ఒక మాత్రం అందర్నీ సర్ప్రైజ్ చేస్తుంది. నా రెండో సినిమాకే ఇన్ని గెటప్స్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా అంగీకరించడానికి కూడా ఇదొక కారణం. అలాగే థాను లాంటి లెజెండరీ నిర్మాత నాతో సినిమా చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ప్రస్తుతం 'గుణ'తోపాటు నాని 'గ్యాంగ్‌లీడర్'లో నటిస్తున్నాను. అలాగే ఇద్దరు నూతన దర్శకులు శేఖర్‌రెడ్డి, శ్రీ సారిపల్లి చిత్రాల్లో నటించేందుకు అంగీకరించాను' అని కార్తీకేయ తెలిపారు.