Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1979లో కర్నాటకలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం 'జిందా గ్యాంగ్' (ది రియల్ గ్యాంగ్ క్యాప్షన్). దేవరాజ్, మేఘనారాజ్ జంటగా మహేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రాన్ని ఈనెల 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రం దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ,'వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే చిత్రాలకు విశేషాదరణ ఉంటుంది. అలాగే మా చిత్రాన్ని కూడా 1979లో జరిగిన యదార్థ సంఘటనలతో సినిమాటిక్ ఫార్మెట్లో తెరకెక్కించాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రమిది. డిఫరెంట్ స్క్రీన్‌ప్లే, గ్రాండియర్ విజువల్స్, వినసొంపైన సంగీతం ఈ చిత్రానికి హైలైట్స్‌గా నిలుస్తాయి. కథానాయకుడు దేవరాజ్ తన నటనతో సినిమాని నిలబెట్టారు. మేఘనా రాజ్ అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది. ఈనెల 14న ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం' అని చెప్పారు. కృష్ణచంద్ర, లోకీ, భరత్‌రాజ్ తలికోట్, యువరాజ్ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి కొరియోగ్రఫీ : త్రిభువన్, రాము, స్టంట్స్ : కౌరవ వెంకటేష్, ఎడిటింగ్ : రవిచంద్రన్, కెమెరా : నగేష్.వి.ఆచార్య, సంగీతం : శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బి.చలపతి, ప్రొడ్యూసర్ : ఎస్.మంజు, స్టోరీ-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం : మహేష్.