Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కపిల్ దేవ్ జీవితం ఆధారంగా, 1983 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమ్ ఇండియా క్రికెట్ జట్టు ఇతివృత్తంతో బాలీవుడ్లో '83' సినిమా రూపొందుతుంది. స్పోర్ట్స్ డ్రామాగా స్ఫూర్తివంతమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రణ్వీర్ సింగ్ ఈ చిత్ర షూటింగ్లో భాగంగా లండన్‌లో ఉన్నారు.
ఈ సందర్భంగా రణ్వీర్ సింగ్‌కి కపిల్ దేవ్ ఓ అరుదైన గిఫ్ట్ అందించారు. తాను తయారు చేసిన 'వి ది సిఖ్స్' అనే కాఫీ టేబుల్ బుక్‌ని రణ్‌వీర్‌కి బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోని రణ్వీర్ అభిమానులతో పంచుకున్నారు. ఇక '83'లో రణ్‌వీర్‌తోపాటు సాఖిబ్ సలీమ్, ఆర్ బద్రీ, హర్డీ సాంధు, చిరాగ్ పాటిల్, పంకజ్ త్రిపాఠి, అమ్మీ విర్క్, సాహిల్ ఖత్తార్, జీవా ప్రధాన పాత్రల్లో క్రికెటర్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది.
ఇదిలా ఉంటే ఇటీవల వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా జట్టు(83 చిత్ర బృందం) స్టయిలీష్‌గా సూట్, బూట్లుతో దిగిన ఫొటో సామాజిక మాద్యమాల్లో వైరల్ అయిన విషయం విదితమే.