Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజరు ఆంటోని, అర్జున్ కాంబినేషన్లో తమిళంలో రూపొందిన చిత్రం 'కొలైగారన్'. దియా మూవీస్ బ్యానర్లో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో పారిజాత మూవీ క్రియేషన్స్ పతాకంపై టి.నరేష్కుమార్, టి.శ్రీధర్ 'కిల్లర్' పేరుతో విడుదల చేస్తున్నారు. ఆండ్రూ లూయిస్ దర్శకుడు. ఆషిమా కథానాయికగా నటించింది. రంజాన్ కానుకగా ఈనెల 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు సైమన్ కె.కింగ్ మాట్లాడుతూ,'ఇది నా మొదటి తెలుగు సినిమా. పాటలకు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన శ్రోతలకు కృతజ్ఞతలు. సినిమా చాలా బాగుంటుంది. స్టోరీతోపాటు విజువల్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. విజరు, అర్జున్ నటన అందరినీ ఆకట్టుకుంటుంది' అని చెప్పారు. ''నకిలీ' నుంచి ఇప్పటివరకు విజరు ఆంటోని చేసిన సినిమాలన్ని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది వంద సినిమాల్లో ఒక సినిమాలా ఉండదు. వంద సినిమాలకు ఒక సినిమాలా ఉంటుంది. అర్జున్ యాక్టింగ్ సూపర్‌గా ఉంటుంది. సరికొత్త స్టయిల్లో ఈ చిత్రాన్ని దర్శకుడు చేశారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది' అని రచయిత భాషశ్రీ అన్నారు.
'కళకి భాషతో సంబంధం లేదు అని మళ్ళీ మళ్ళీ నిరూపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమా ప్రమోషన్స్ చాలా బాగా చేస్తున్నారు. సినిమా కూడా బాగుంటుంది. పెద్ద హిట్ అవుతుంది. మళ్ళీ సక్సెస్ మీట్ తప్పకుండా మీ అందరినీ కలుస్తాననే నమ్మకం ఉంది' అని కథానాయకుడు విజరు ఆంటోని తెలిపారు. 'సినిమా కథపట్ల ఉన్న ఆసక్తితోనే ఈచిత్రాన్ని తెలుగులో విడుదల చేయాలనుకున్నాం. ఇంట్రెస్టింగ్ అంశాలు, ఉత్కంఠ రేకెత్తించే సన్నివేశాలు ఇందులో చాలా ఉన్నాయి. సినిమా తప్పకుండా అందరూ ఆదరిస్తానే నమ్మకం ఉంది' అని నిర్మాతలు చెప్పారు.
'ఈ సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్గా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
ఈ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నాను. నన్ను హీరోయిన్గా ఎంపిక చేసుకున్న దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. సావిత్రిగారిలా మంచి పేరు తెచ్చుకోవాలన్నదే నా ఆశ. సినిమా అవుట్‌ఫుట్ చాలా బాగా వచ్చింది' అని కథానాయిక ఆషిమా నర్వాల్ అన్నారు.