Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాజల్ ప్రస్తుతం తొలిసారి కమల్ హాసన్‌తో కలిసి 'భారతీయుడు 2'లో నటిస్తుంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. లైకా సంస్థ నిర్మిస్తుంది. పలు కారణాలతో ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయింది. త్వరలోనే పట్టాలెక్కుతుందని భావించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాజల్ కూడా ఇదే విషయం చెప్పింది. తాజాగా కాజల్ ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటుందట. ఈ సినిమా ఇంకా ప్రారంభం కాకపోవడంతో డేట్స్ విషయంలో ఇబ్బంది పడుతున్న కాజల్ ఈ సినిమా నుంచి వైదొలగాలని నిర్ణయించుకుందట. ఇటీవల ఎన్నికల నేపథ్యంలో కమల్ హాసన్ బిజీగా గడిపారు. ఇప్పుడు ఆయన తమిళంలో 'బిగ్‌బాస్ 3'తో బిజీ అయ్యారు. వాటి నుంచి రిలీఫ్ అవ్వడానికి మరో రెండు నెలలు పట్టేలా ఉంది. దీనికితోడు 'భారతీయుడు2' బడ్జెట్ విషయంలో తలెత్తిన వివాదం ఇంకా సర్దుమనగ లేదట. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితి, అదే సమయంలో సినిమా ఉంటుందా? ఆగిపోతుందా? అనే సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో కాజల్ ఈ సినిమాకి గుడ్ బై చెప్పేయాలని నిర్ణయించుకుందట. అయితే తనకిష్టమైన దర్శకుడు శంకర్, ఫేవరేట్ హీరో కమల్హాసన్ల సినిమా వదులుకోవడం ఒకింత బాధగానూ ఫీలవుతుందట. మరి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా? గుడ్ బై చెప్పి మరో సినిమాకి కమిట్ అవుతుందా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. మరోవైపు తాను నటించిన బాలీవుడ్ 'క్వీన్' తమిళ రీమేక్ 'పారిస్ పారిస్' కూడా ఇప్పటికీ విడుదలకు నోచుకోవడం లేదు. దీంతో ఆమె పూర్తి నిరాశలో ఉందని తెలుస్తుంది. వీటితోపాటు కాజల్ ప్రస్తుతం తమిళంలో 'కోమలి', తెలుగులో 'రణరంగం' చిత్రాల్లో నటిస్తుంది.