Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాగర్ గంధం, ప్రగ్య నయన్ జంటగా సుమన్, వినోద్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'సమరం'. బషీర్ ఆలూరి దర్శకత్వంలో యూనివర్సల్ ఫిలిమ్స్ సమర్పణలో జననీ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ వీరం శెట్టి, పి.లక్ష్మణాచారి సంయుక్తంగా తెలుగు, కన్నడ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ శుక్రవారం విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ, 'టైటిల్ చాలా బాగుంది. పోస్టర్స్ అన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. డైరెక్టర్ బషీర్ చెప్పిన కాన్సెప్ట్ కొత్తగా ఉంది. కచ్చితంగా ఆడియెన్స్‌కి నచ్చే చిత్రమవుతుంది. సినిమా మంచి విజయం సాధించి హీరో సాగర్ మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'తెలుగులో నాకిది మూడో సినిమా. ఇందులో మంచి పాత్ర పోషిస్తున్నా. సుమన్, వినోద్ కుమార్ వంటి సీనియర్ నటీనటులతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది' అని హీరో సాగర్ చెప్పారు. చిత్ర దర్శకుడు బషీర్ మాట్లాడుతూ, 'వినాయక్ లాంటి పెద్ద డైరెక్టర్ మా సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. విలేజ్ నుండి సిటీకి వచ్చిన ఒక ఇంజనీరింగ్ అమ్మాయి సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవుతుంది. అక్కడ ఎలాంటి పరిణామాలు జరిగాయి అనేది చిత్ర కథాంశం. మర్డర్ మిస్టరీ
నేపథ్యంలో యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో
అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది' అని అన్నారు. 'చిన్నప్పట్నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా మంచి సినిమా తీయాలని నా కోరిక. డైరెక్టర్ బషీర్ చెప్పిన కథ నచ్చి ఈ సినిమా తీశాను. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఊహించిన దానికన్నా బాగా వచ్చింది. కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాం' అని నిర్మాత పోకూరి లక్ష్మణాచారి చెప్పారు. మరో నిర్మాత శ్రీనివాస్ వీరంశెట్టి చెబుతూ, 'మా హీరో సాగర్ ఎంతో సపోర్ట్ అందించారు. ఆణి ముత్యాల్లాంటి ఐదు పాటలు, నాలుగు ఫైట్స్ ఉన్నాయి. త్వరలోనే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్‌గా నిర్వహిస్తాం' అని అన్నారు.