Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం రూపొందుతుంది. రామ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రమిది. ఇటీవల విడుదల చేసిన చిత్ర లుక్స్‌కి, టీజర్‌కి మంచి స్పందన లభించింది. తాజాగా శుక్రవారం ఈ చిత్రంలోని 'దిమాక్ ఖరాబ్' అంటూ సాగే తొలిపాటని విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటని మణిశర్మ కంపోజ్ చేశారు. యూట్యూబ్‌లో విడుదలైన ఈ పాటకి విశేష స్పందన లభిస్తుంది. 'ఎనర్జిటిక్ హీరో రామ్, డేరింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన టీజర్ మరిన్ని అంచనాలను పెంచింది. తాజాగా 'దిమాక్ ఖరాబ్ ..' అంటూ సాగే పాట విశేషంగా అలరిస్తుంది. ఇందులో రామ్ సరసన ఇద్దరు కథానాయికలు నభా నటేష్, నిధి అగర్వాల్ స్టెప్పులేయడం విశేషం. వారి డాన్స్, అందాలు హైలైట్‌గా నిలుస్తాయి. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జులై 12న విడుదల చేస్తాం' అని చిత్ర బృందం తెలిపింది. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: జునైద్ సిద్ధికీ, ఆర్ట్: జానీ షేక్, కెమెరా: రాజ్ తోట.