Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హాలీవుడ్‌లోని పాపులర్ సిరీస్‌లో 'మెన్ ఇన్ బ్లాక్' ఒకటి. సైన్స్ ఫిక్షన్‌గా రూపొందుతున్న ఈ సిరీస్‌లో తాజాగా 'మెన్ ఇన్ బ్లాక్ ఇంటర్నేషనల్' పేరుతో ఓ సినిమా రాబోతుంది. లియాన్ నీసన్, క్రిస్ హెమ్స్‌వర్త్, టెస్సా థామ్సన్, రెబెక్కా పెర్గుసన్, కుమిలి సంజీయని, రఫ్స్పెల్, లెస్ ట్విన్స్, ఎమ్మా థామ్సన్ ప్రధాన పాత్రలు పోషించగా, ఎఫ్.గ్యారీ గ్రరు దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఇండియాలో విడుదల చేస్తుంది. 'సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సరికొత్త కథతో ఈ సినిమా రాబోతుంది. దాదాపు 110 మిలియన్ డాలర్లతో రూపొందింది. ప్రపంచ వ్యాప్తంగా 'మెన్ ఇన్ బ్లాక్' సిరీస్‌కి మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో ఈ చిత్రం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంది. న్యూయార్క్ సిటీ, మొరాక్కో, ఇటలీ, లండన్ వంటి దేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాని తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ నెల 14న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు' అని సోని పిక్చర్స్ నిర్వాహకులు తెలిపారు.