Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపీచంద్, మెహరీన్ జంటగా జరీనా ఖాన్ ప్రధాన పాత్రలో తిరు దర్శకత్వంలో ఏ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి 'చాణక్య' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా
చిత్ర టైటిల్ లోగోని విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'భారీ బడ్జెట్‌తో యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమాని రూపొందిస్తున్నాం. ఈ సినిమాలో గోపీచంద్‌ని దర్శకుడు తిరు సరికొత్త పంథాలో చూపిస్తున్నారు. గోపీచంద్ గతంలో ఎప్పుడూ ఇలాంటి సినిమా చేయలేదు. షూటింగ్ ఇప్పటికే యాభై శాతం పూర్తయ్యింది. ప్రస్తుత షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతుంది. తాజాగా ప్రకటించిన టైటిల్‌కి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తుంది. త్వరలోనే చిత్ర ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తాం' అని తెలిపింది. ఈ చిత్రానికి మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్, కెమెరామెన్: వెట్రీ పళని స్వామి, ఆర్ట్: రమణ వంకా.