Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'హౌస్‌ఫుల్', 'గోల్మాల్', 'ధూమ్', 'క్రిష్' వంటి ఫ్రాంఛైౖజీల వలే 'డాన్' సిరీస్ కూడా బాలీవుడ్లో పాపులర్ అయ్యింది. అంతేకాదు అత్యంత విజయవంతమైన ఫ్రాంఛైజీగానూ నిలిచింది. తాజాగా ఈ ఫ్రాంఛైజీలో నాలుగో సినిమాకి ప్లాన్ జరుగుతుంది. త్వరలోనే 'డాన్ 3' రాబోతుంది. రణ్ బీర్ కపూర్ హీరోగా ఈ సినిమాని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ప్రస్తుతం రణ్‌బీర్‌తో కథా చర్చలు జరుపుతున్నారట. ఇందులో నటించేందుకు రణ్‌బీర్ కూడా ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. అన్ని కుదిరితే త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. ఇదిలా ఉంటే 'డాన్' ఫ్రాంఛైజీ 1978లో ప్రారంభమైంది. మొదటి చిత్రం 'డాన్'లో అమితాబ్ బచ్చన్, జీనత్ అమన్ జంటగా నటించగా, చంద్ర బరోత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత 2006లో 'డాన్: ది ఛేజ్ బిగిన్స్ ఎగైన్' వచ్చింది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో షారూఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా సైతం భారీ విజయాన్ని సాధించి రూ.వందకోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. దీనికి రెండో సీక్వెల్ 'డాన్ 2' 2011లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దాదాపు రూ.200కోట్లు వసూలు చేసింది. తాజాగా మూడో సీక్వెల్‌కి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం రణ్‌బీర్ 'బ్రహ్మాస్త్ర'తోపాటు 'శంషేరా' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.