Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్య, కేథరిన్ థ్రెస్సా హీరోహీరోయిన్లుగా రాఘవ దర్శకత్వంలో తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన 'కదంబన్' చిత్రాన్ని లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ పతాకంపై భారతి వరప్రసాద్ వడ్డెల్ల సమర్పణలో ఉదరు హర్ష వడ్డెల్ల తెలుగులో 'గజేంద్రుడు' పేరుతో విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 21న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా నిర్మాత ఉదరు హర్ష వడ్డెల్ల మాట్లాడుతూ, 'హీరో ఆర్య అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. హీరోగా, విలన్‌గా తమిళంలో అద్భుమైన సినిమాలు చేశారు. అలాగే ఆర్య సరసన అందాల తార కేథరిన్ హీరోయిన్గా నటించింది. వీరిద్దరి జంట తెరపై కనువిందు చేస్తుంది. తమిళంలో ఘన విజయం సాధించి, క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకున్న చిత్రమిది. ఓ కొండ ప్రాంతంలో ఉండే గిరిజన పుత్రులుగా హీరో హీరోయిన్స్ నటించారు. సినిమా మొత్తం కొండ ప్రాంతంలో సాగుతూ ఆద్యంతం థ్రిల్‌కి గురి చేసేలా ఉంటుంది. ఆర్య ఈ సినిమా కోసం వెయిట్ పెరగడమే కాకుండా ఆ కొండల్లో ఎంతో శ్రమించి చిత్రీకరణలో పాల్గొన్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమాకు మరో హైలెట్‌గా యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఉంటుంది. భారీ బడ్జెట్‌తో విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 21న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. తమిళంలోలాగే తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం' అని చెప్పారు.