Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పక్కా కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ పాత్రలతో అందరినీ అలరించిన తమన్నా ఈ మధ్య రూటు మార్చి హర్రర్ చిత్రాల్లో నటించి భయపెట్టింది. ఇవి కూడా రొటీన్ కావడంతో తాజాగా ఓ డాన్స్ బేస్డ్ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చిందని సమాచారం. డాన్స్ నేపథ్యంలో ఇప్పటికే బాలీవుడ్లో పలు చిత్రాలొచ్చాయి. వాటితో పోలిస్తే పూర్తి వైవిధ్యంగా, లేటెస్ట్ ట్రెండ్‌కి తగ్గట్టుగా ఈ డాన్స్ బేస్డ్ స్క్రిప్ట్ ఉండటంతో తమన్నా నటించేందుకు అమితాసక్తి చూపిస్తున్నారట. తమన్నా డాన్స్ బాగా చేస్తుందనే ప్రేక్షకుల ప్రశంసలు కూడా ఆమె ఈ చిత్రానికి అంగీకరించడానికి ముఖ్య కారణమట. ఇదిలా ఉంటే, తెలుగులో మంచి
విశేష ప్రేక్షకాదరణ పొందిన హర్రర్ థ్రిల్లర్ 'ఆనందో బ్రహ్మ' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈచిత్రంలోనూ తమన్నా నటించేందుకు పచ్చ జెండా ఊపారు. 'ఆనందో బ్రహ్మ'లో తాప్సీ పోషించిన పాత్రను
తమన్నా పోషించబోతున్నారట. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది. వీటితోపాటు తమన్నా ప్రస్తుతం 'సైరా నరసింహారెడ్డి', 'ఖామోషి' చిత్రాల్లో నటిస్తోంది. చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో తమన్నా తొలిసారి నెగటివ్ రోల్ పోషిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.