Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్ జంటగా అథ్లెటిక్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న చిత్రం 'క్లాప్'. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో పృథ్వీ ఆదిత్య దర్శకుడిగా బిగ్ ప్రింట్ పిక్చర్స్ అండ్ సర్వన్త్ రామ్ క్రియేషన్స్ పతాకాలపై ఐబి కార్తికేయన్, ఎం.రాజశేఖర్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కబోతున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్‌పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా క్లాప్ నివ్వగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచాన్ చేశారు. తమిళ వర్షెన్‌కి కథానాయకుడు నాని క్లాప్ ఇచ్చారు. ఈ చిత్ర బౌండెడ్ స్క్రిప్ట్‌ను ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్ చిత్రయూనిట్‌కి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో ఆదిపినిశెట్టి మాట్లాడుతూ,'క్రీడా నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలొచ్చాయి. వాటితో పోలిస్తే ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ చిత్రంలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాను. నిర్మాత కార్తికేయన్‌తో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. అది ఇప్పటికి కుదిరింది. వెరీ వెరీ హార్ట్ టచ్చింగ్ కథతో రూపొందుతున్న ఈ చిత్రంపై అందరం మంచి కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం' అని చెప్పారు. 'అథ్లెటిక్ స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఈ కథ విని నిర్మాత కార్తికేయన్ వెంటనే సినిమా చేద్దామనటంతో ఇది ట్రాక్ ఎక్కింది' అని దర్శకుడు పృథ్వీ ఆదిత్య అన్నారు. 'తెలుగులో నేను నటిస్తున్న మూడవ చిత్రమిది. తమిళంలో తొలి సినిమా. ఈ సినిమాలో నటించడానికి చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాను. ఇందులో చాలా శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నాను. ఈ ఛాన్స్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు' అని కథానాయిక ఆకాంక్ష సింగ్ తెలిపారు. 'మిత్రుడు రాజశేఖర్ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. కథ విని బాగా ఇంప్రెస్ అయ్యాను. ఇళయరాజాగారి మ్యూజిక్ ఈ చిత్రానికి బిగ్ ఎస్సెట్ కానుంది. ఈ చిత్రంలోని క్యారెక్టర్‌కి ఆది తప్ప మరెవ్వరూ సూట్ కారు. ఈ నెల 17 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, మధురైల్లో షూటింగ్ జరుపుతాం. నాలుగు షెడ్యూల్స్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తాం' అని చిత్ర సమర్పకుడు జవ్వాజి రామాంజనేయులు చెప్పారు.